![]() |
![]() |

వంటలక్క ఈ పేరు ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు పేరు కంటే ఈ పేరుతోనే ఆమెకు స్టార్ డం వచ్చిపడింది. ఈమెకు లేడీ ఫాన్స్ మాములుగా లేరు. వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ మన తెలుగమ్మాయి కాకపోయినా మన తెలుగు ఆడియన్స్ మాత్రం ఆమెకు బ్రహ్మరధం పట్టారు. ఇక ఈమె నటిస్తున్న కార్తీక దీపం సీరియల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే కొంతకాలం పాటు ఈ సీరియల్ ట్రాక్ మారింది.
కానీ ఆడియన్స్ ఒప్పుకోకపోయేసరికి మళ్ళీ ఆ పాత ట్రాక్ ని తీసుకొచ్చి కొన్ని మోడిఫికేషన్స్ చేసి సీరియల్ ని మళ్ళీ గాడిలోకి తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు వంటలక్క తన భర్త పుట్టినరోజు వేడుకల్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని తన ఇన్ గ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక కేరళకు చెందిన ప్రేమి విశ్వనాథ్ భర్తపేరు వినీత్ భట్. ఆయన జ్యోతిష్యం శాస్త్ర నిపుణులు.
![]() |
![]() |